20 రోజుల్లో ఎన్నో విషాద ఘ‌ట‌న‌లు: ఉపాస‌న భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

20 రోజుల్లో ఎన్నో విషాద ఘ‌ట‌న‌లు: ఉపాస‌న భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు

upasana about lockdown
  • కుటుంబంలో ముగ్గురు పెద్ద‌వారిని కోల్పోయా
  • హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి బాధాక‌ర వార్త
  • దేశంలో క‌రోన కేసులు ఉద్ధృతంగా పెరిగిపోతున్నాయి
  • మ‌న దేశాన్ని ర‌క్షించ‌డానికి జ‌వాన్లు ప్రాణాలు ఇస్తున్నారు
గ‌త‌ 20 రోజుల్లో ప‌లు విషాద ఘ‌ట‌న‌లు త‌మ‌ను క‌లిచి వేసేలా చేశాయంటూ సినీన‌టుడు రామ్ చ‌ర‌ణ్ భార్య‌  ఉపాస‌న భావోద్వేగభ‌రిత వ్యాఖ్య‌లు చేసింది. త‌మ కుటుంబంలో ముగ్గురు పెద్ద‌వారిని కోల్పోయామ‌ని, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి బాధాక‌ర వార్త విన్నామ‌ని, దేశంలో క‌రోన కేసులు ఉద్ధృతంగా పెరిగిపోతున్నాయ‌ని తెలిపింది. మ‌న దేశాన్ని ర‌క్షించ‌డానికి జ‌వాన్లు ప్రాణాలు ఇస్తున్నార‌ని గుర్తు చేసింది.

స‌రిగ్గా వారం రోజుల క్రితం త‌మ 8వ పెళ్లి రోజు తేదీ వ‌చ్చింద‌ని, అయితే, దాన్ని జ‌రుపుకునే మూడ్ లో తామిద్దరం లేమ‌ని తెలిపింది. అందుకే, ఆ రోజు ఇంట్లో మూడు రకాల ఆవ‌కాయ ప‌చ్చ‌డితో అన్నం తింటూ, చిప్స్ నములుతూ, టీవీ చూస్తూ గ‌డిపామ‌ని చెప్పింది. క‌లిసి ఉండ‌డంపై మరపురాని పాఠం నేర్చుకున్నాన‌ని చెప్పింది .
upasana
Ramcharan
Tollywood

More Telugu News