Yanamala: లోకేశ్ పై దాడి చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటాం?: యనమల

Yanamala explains yesterday situations in AP Legislative Council meeting
  • నిన్నటి శాసనమండలి సమావేశాల్లో రగడ
  • సభలో పరిణామాలకు ప్రభుత్వమే కారణమన్న యనమల
  • మంత్రులు తిట్ల పురాణం అందుకున్నారని వెల్లడి
నిన్న శాసనమండలిలో తీవ్ర పరిణామాలు జరిగినట్టు వైసీపీ ఆరోపిస్తోంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేసినట్టు వైసీపీ చెబుతోంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. సభలో జరిగిన పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే కారణమని అన్నారు. సబ్జెక్టుతో సంబంధంలేని మంత్రులు మండలిలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

సాధారణంగా సభలో ప్రతిపక్షం గొడవ చేస్తుందని, కానీ ఇక్కడ అధికార పక్షమే గొడవ చేస్తోందని యనమల విమర్శించారు. అయినా, లోకేశ్ పై దాడి చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటామని అన్నారు. మండలిలో మంత్రులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, గతంలో ఎప్పుడూ లేని విధంగా మంత్రులు తిట్ల పురాణం అందుకున్నారని విమర్శించారు. మండలి సమావేశాలకు అంతరాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరించినట్టు అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Yanamala
AP Legislative Council
Meeting
Telugudesam
YSRCP

More Telugu News