Taimur: సైఫ్ అలీఖాన్ ఇంటర్వ్యూ ఇస్తోంటే మధ్యలో వచ్చిన తైమూర్‌.. నవ్వాపుకోలేకపోయిన యాంకర్‌.. వీడియో వైరల్

 Taimur made a delightful guest appearance
  • బాలీవుడ్‌ తారలు సైఫ్, క‌రీనా క‌పూర్‌ల కుమారుడు తైమూర్ 
  • సీరియస్‌గా ఇంటర్వ్యూ ఇస్తోంటే వచ్చిన తైమూర్
  • నవ్వుకున్న సైఫ్
బాలీవుడ్‌ తారలు సైఫ్ అలీఖాన్, క‌రీనా క‌పూర్‌ల కుమారుడు తైమూర్ అలీఖాన్‌ సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే స్టార్ అయిపోయాడు. ఆ చిన్నారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జాతీయ మీడియా పదే పదే ప్రచురిస్తుంటుంది. తాజాగా, తైమూర్‌కు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
   
త‌న తండ్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతోన్న సమయంలో మ‌ధ్య‌లో వ‌చ్చి డిస్టర్బ్‌ చేశాడు. ఈ వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది. సీరియస్‌గా మాట్లాడుతోన్న సమయంలో మధ్యలో వచ్చిన తన కుమారుడిని చూసి సైఫ్ అలీ ఖాన్‌ కూడా న‌వ్వాడు. ప్రేక్షకులకు సారీ చెప్పి, తైమూర్‌కి కిస్‌ ఇచ్చాడు. దీంతో యాంకర్‌ కూడా నవ్వు ఆపుకోలేకపోయింది.

       
Taimur
Viral Videos
Bollywood

More Telugu News