Andhra Pradesh: ఏపీలో మరో 299 మందికి సోకిన కరోనా

AndhraPradesh New Cases 299 Active Cases 2779 Positive Cases
  • గత 24 గంటల్లో 13,923 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసులు 5,854
  • ఆసుపత్రుల్లో కరోనాకు 2,779 మందికి చికిత్స
  • ఇప్పటివరకు 2,983 మంది డిశ్చార్జ్  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 13,923 శాంపిళ్లను పరీక్షించగా మరో 299 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 77 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 5,854 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 2,779 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,983 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 92కి చేరింది.      
             
Andhra Pradesh
Corona Virus
COVID-19

More Telugu News