Tamil Nadu: కరోనా వ్యాప్తి ప్రభావం.. తమిళనాడులో నాలుగు జిల్లాల్లో వాహన విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై నిషేధం

vehicle sales ban in four tamilnadu districts
షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులో కరోనా కేసులు ప్రతి రోజూ పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండడంతో రాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో వాహన విక్రయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ తెన్‌కాశి జవహర్ తెలిపారు. చెన్నై‌తోపాటు తిరువళ్లూర్‌, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో చెన్నై సహా ఈ మూడు జిల్లాల్లోనూ వాహన విక్రయాలపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. వాహన విక్రయాలతోపాటు రిజిస్ట్రేషన్ సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఆర్టీవో, రవాణాశాఖ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు, షిఫ్టుల విధానంలో  ఉద్యోగులు పనిచేస్తారని ఆయన వివరించారు. కాగా, ఈ నాలుగు జిల్లాల్లో రేపటి నుంచి ఈనెల 30 వరకు సంపూర్ణ కర్ఫ్యూ విధించనున్నారు.
Go Back to Shorts
Tamil Nadu
Chennai
Corona Virus
vehicle sales

More Telugu News