Bahubali: రాజ్ కపూర్ తరువాత ప్రభాస్ కే... ప్రతిష్ఠాత్మక రష్యా అవార్డు!

After Raj Kapoor Prabhas Wins Russain Movie Fans Heart
  • బాహుబలితో రష్యా ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్
  • తాజాగా 2015 అవార్డులను ప్రకటించిన రష్యా
  •  'రష్యన్ ఆడియన్స్ హార్ట్' అవార్డు ప్రభాస్ కు
'బాహుబలి' రెండు భాగాల తరువాత, భారత సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయడంతో పాటు, ఎన్నో దేశాల్లో అభిమానులను పెంచుకున్న హీరో ప్రభాస్, ఇప్పుడు ఓ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకున్నారు. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందడంతో, 'రష్యన్ ఆడియన్స్ హార్ట్' అవార్డు ప్రభాస్ కు లభించింది.

తన అద్భుతమైన నటనతో లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్, దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇదే అవార్డును అందుకోగా, ఆపై మరే ఇండియన్ నటుడికీ దక్కని ఘనత ప్రభాస్ కు దక్కింది. 'శ్రీ 420', 'ఆవారా', 'ఆరాధన' వంటి చిత్రాలతో రష్యా సినీ అభిమానులను మెప్పించిన రాజ్ కపూర్, గతంలో ఇదే అవార్డును అందుకున్నారు.

తాజాగా, 2015 అవార్డులను ప్రకటించగా, ప్రభాస్ కు అభిమానులను మెప్పించిన విభాగంలో అవార్డు లభించింది. ఇది 'బాహుబలి' చరిత్రలో మరో రికార్డుగా నిలువనుంది. ఈ చిత్రం జీవితానుభూతులను మించిన అనుభూతిని అందిస్తుందని, ముఖ్యంగా క్లయిమాక్స్ సీన్స్ ఒళ్లు జలదరించేలా ఉంటాయని, ఏ సమయంలోనైనా ఈ సినిమాను చూసి ఆనందించవచ్చని ఈ సందర్భంగా అవార్డు కమిటీ వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు భాగాలు, కోట్లాది మందిని అలరించిన సంగతి తెలిసిందే.
Bahubali
Prabhas
Russia
Award

More Telugu News