Devineni Uma: ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది, చెప్పండి జగన్ గారు: దేవినేని ఉమ

devineni fires on ycp
  • పెద్దల సభలో మంటలు
  • ఎమ్మెల్సీని తన్నిన మంత్రి
  • ఎమ్మెల్సీని ఏరా అన్న మంత్రి
  • రాజధాని మార్పు బిల్లే ముఖ్యమా?  
నిన్న ఏపీ శాసన మండలిలో పలు  బిల్లులను ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో జరిగిన గందరగోళంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఎమ్మెల్సీ బీదను మంత్రి వెల్లంపల్లి తన్నారని, తొడగొట్టి మంత్రి అనిల్‌ సవాల్ విసిరారని, దూషణలతో మండలిలో గందరగోళం నెలకొందని ఓ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.
 
'పెద్దల సభలో మంటలు.. ఎమ్మెల్సీని తన్నిన మంత్రి.. తొడగొట్టిన మంత్రి.. ఎమ్మెల్సీని ఏరా అన్న మంత్రి.. రాజ్యాంగ సంక్షోభం. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదంకంటే రాజధాని మార్పు బిల్లే ముఖ్యమా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు' అని దేవినేని ఉమ విమర్శించారు.
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News