Viral Videos: దారుణంగా కొట్టి.. యువకుడితో మూత్రం తాగించి 'వీడియో' తీసిన కుల పెద్దలు !

  • రాజస్థాన్‌లోని శిరోహిలో అమానుష ఘటన 
  • అమ్మాయిని ప్రేమించాడని కొట్టిన కుల పెద్దలు
  • బూటులో నీళ్లు పోసి తాగించిన వైనం
  • ఆరుగురి అరెస్టు
a man forced to drink urine

రాజస్థాన్‌లోని శిరోహిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడితో కొందరు మూత్రం తాగించి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి, మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఓ అమ్మాయి, అబ్బాయి కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి కులాలు ఒకటే. అయినప్పటికీ, కుల పెద్దలు వారి ప్రేమకు మోకాలడ్డారు. ఆ యువకుడు తమ మాట వినట్లేదని చివరకు దారుణంగా కొట్టి, బూటులో నీళ్లు పోసి తాగించి,  ఓ బాటిల్‌లో మూత్రం పోసి తీసుకువచ్చి తాగించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News