Satyender Jain: ఢిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా నెగెటివ్... ఊపిరి పీల్చుకున్న కేజ్రీ సర్కారు

Delhi health minister Satyender Jain tested corona negative
  • ఢిల్లీలో కరోనా విలయతాండవం
  • తీవ్ర జ్వరంతో ఆసుపత్రిపాలైన ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్
  • వైద్య పరీక్షల్లో కరోనా లేదని వెల్లడి
ఢిల్లీలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతుండడం అక్కడి ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనకు కరోనా సోకిందేమోనన్న అనుమానాలు తలెత్తాయి. తాజాగా, ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు, సత్యేందర్ జైన్ తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు జ్వరం ఇంకా తగ్గలేదని, అయినప్పటికీ భయపడాల్సింది ఏమీ లేదని వైద్య వర్గాలు తెలిపాయి.
Satyender Jain
Corona Virus
Negative
Health Minister
Delhi
Arvind Kejriwal

More Telugu News