Andhra Pradesh: రూ. 2,24,789.18 కోట్లతో ఏపీ బడ్జెట్.. హైలైట్స్ పార్ట్ - 1

  • వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కు రూ. 3,615.60 కోట్లు
  • హోం శాఖకు రూ. 5,988.72 కోట్లు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దికి రూ. 16,710.34 కోట్లు
Andhra Pradesh annual budget

ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అని చెప్పారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమంపై వెనకడుగు వేయలేదని చెప్పారు. కరోనాపై పోరాటంలో ముందున్నామని అన్నారు.  బడ్జెట్ హైలైట్స్ ఇవే....


ఏపీ బడ్జెట్ 2020-21:
బడ్జెట్ అంచనా వ్యయం - రూ. 2,24,789.18 కోట్లు
రెవెన్యూ అంచనా వ్యయం - 1,80,392.65 కోట్లు
మూలధన అంచనా వ్యయం - 44,396.54 కోట్లు    

సవరించిన అంచనాలు 2019-20:
రెవెన్యూ వ్యయం - రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం - రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు - రూ. 26,646.92 కోట్లు

వివిధ పథకాలకు కేటాయింపుల వివరాలు:
వ్యవసాయ రంగానికి - రూ. 11,891 కోట్లు
వైయస్సార్ పంటల ఉచిత బీమా పథకానికి - రూ. 500 కోట్లు
వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ - రూ. 3,615.60 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం - రూ. 1,100 కోట్లు
104, 108 పథకాలకు - రూ. 470.29 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉన్నత విద్యకు - రూ. 2,277 కోట్లు
ప్రాథమిక, ఇంటర్ విద్యకు - రూ. 22,604 కోట్లు
ఆరోగ్య రంగానికి - 11,419.44 కోట్లు
హోం శాఖకు - రూ. 5,988.72 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి - రూ. 1,279.78 కోట్లు
ఐటీ రంగానికి - రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమ రంగానికి - రూ. 601.37 కోట్లు
జలవనరుల శాఖకు - రూ. 11,805.74 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దికి - రూ. 16,710.34 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి - రూ. 696.62 కోట్లు

More Telugu News