AP Legislative Council: ఏపీ శాసనమండలి సమావేశాలు మూడ్రోజులు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం

AP Legislative Council sessions to be conducted three days
  • ఏపీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం
  • ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో చెప్పాలన్న టీడీపీ సభ్యులు
  • సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రవేశపెట్టడం సరికాదని హితవు
ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా శాసనమండలి బీఏసీ సమావేశం నిర్వహించారు. పలు బిల్లులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మూడ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సభలో ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారో సమాచారం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. ఒకవేళ సీఆర్డీయే రద్దు బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటే, అది సరైన నిర్ణయం కాదని టీడీపీ సభ్యులు స్పష్టం చేశారు. అటు, ఏపీ అసెంబ్లీని రెండ్రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
AP Legislative Council
Budget Session
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News