Vijay Sai Reddy: నల్ల చొక్కా వేసుకున్న చంద్రబాబు ఫొటోను పోస్ట్ చేసి ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి

vijaya sai reddy fires on chandra babu naidu
షార్ట్స్‌లో చూడండి
ఈ రోజు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలు నల్లచొక్కాలతో హాజరైన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లారు. ఆయన నల్ల చొక్కా ధరించిన ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్ట్ చేసి విమర్శలు గుప్పించారు.

 'నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా? నాయుడూ వాటే కలర్‌సెన్స్!' అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, ఏడాది కాలంగా ఏపీలో ప్రభుత్వ తీరుకి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు నల్లచొక్కాలు వేసుకుని ఈ రోజు పలు ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News