America: ఫేస్ మాస్కుల విషయంలో.. అమెరికా విమానయాన సంస్థల కీలక నిర్ణయం!

US airlines make a major decision on air travel
  • మాస్క్ ధరించకుంటే ‘నో ఫ్లై’ జోన్‌లోకి
  • ఆహారం తీసుకునేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మాస్క్ తీయొచ్చు
  • విమానం ఎక్కడానికి ముందే హామీ ఇవ్వాలి
విమాన ప్రయాణాలపై అమెరికా విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై మాస్క్ ధరించని ప్రయాణికులను ‘నో ఫ్లై’ జాబితాలోకి చేర్చాలని నిర్ణయించాయి. ఈ మేరకు అలస్కా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, హవాయిన్ ఎయిర్‌లైన్స్, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లు పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంలో కొన్ని సడలింపులు కూడా ఇచ్చాయి. ఆహారం తీసుకునేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మాత్రం మాస్కులు తొలగించుకోవచ్చని పేర్కొన్నాయి. విమానం ఎక్కడానికి ముందే ఫేస్ మాస్క్ ధరిస్తామని ప్రయాణికులు హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి.



America
No fly
face mask
Corona Virus

More Telugu News