Nimmakayala Chinarajappa: అందుకే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు.. మాపై కేసులు పెట్టారు: చినరాజప్ప

chinarajappa fires on ycp
  • సొంత బిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు 
  • అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించకూడదనే అచ్చెన్న అరెస్టు
  • ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే మాపై కేసులు
  • టీడీపీ ప్రజాప్రతినిధుల నోరు నొక్కాలని ప్రయత్నాలు
సొంత బిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ నేత చినరాజప్ప ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీలో ఎవరూ ప్రశ్నించకూడదనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఇటీవల పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడితో పాటు తనపై అన్యాయంగా కేసులు పెట్టారని ఆయన చెప్పారు.

టీడీపీ ప్రజాప్రతినిధుల నోరు నొక్కాలని ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని తెలిపారు. కాగా, జే-ట్యాక్స్‌ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త బ్రాండ్‌ మద్యాన్ని తీసుకొచ్చిందని నిమ్మల రామానాయుడు చెప్పారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా చేశారని తెలిపారు. బడ్జెట్‌ ఆమోదం కోసమే హడావుడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరపించారు.
Nimmakayala Chinarajappa
Telugudesam
Andhra Pradesh

More Telugu News