Chandrababu: రాజధాని కోసం రాజీలేని పోరాటం చేస్తాం: అమరావతి రైతులతో చంద్రబాబు
- ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత
- అమరావతి రైతులకు చంద్రబాబు మద్దతు
- ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వెళ్లేముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద తమ పోరాటానికి మద్దతుగా అమరావతి రైతులు నినాదాలు చేశారు. వారికి చంద్రబాబుతో పాటు ఇతర టీడీపీ నేతలు మద్దతు తెలిపారు.
అమరావతి రాజధాని కోసం తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. రైతులకు తాము అండగా ఉంటామని తెలిపారు.