Chandrababu: అచ్చెన్నాయుడుని కలిసేందుకు చంద్రబాబుకు అనుమతి నిరాకరణ

Permission denied to Chandrababu to meet Atchannaidu
షార్ట్స్‌లో చూడండి
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయడు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు చిన్న ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు... చికిత్స నిమిత్తం తొలుత ఆసుపత్రికి తరలించాలంటూ ఏసీబీ అధికారులను ఆదేశించింది.

ఈ క్రమంలో, అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు యత్నించారు. అయితే, పరామర్శపై ఆయన చేసుకున్న అభ్యర్థనను జైళ్ల శాఖ అధికారులు నిరాకరించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో, పరామర్శకు అనుమతిని ఇవ్వలేమని చెప్పారు. గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వలేదని... ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇదే అంశంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందిస్తూ... మేజిస్ట్రేట్ అనుమతిని చంద్రబాబు తీసుకోవాలని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Atchannaidu
Telugudesam
GGH

More Telugu News