Atchannaidu: ఈఎస్ఐ ఆసుపత్రిలో అచ్చెన్నకు వైద్య పరీక్షలు.. కరోనా టెస్టు కోసం స్వాబ్ సేకరణ

 Doctors collected swab from TDP leader Atchannaidu for corona virus test
  • విజయవాడ ప్రభుత్వాసుపత్రి కోవిడ్ ఆసుపత్రిగా మార్పు
  • ఈఎస్ఐ ఆసుపత్రిలో బీపీ, షుగర్ పరీక్షలు
  • కాలు నొప్పిగా ఉందని చెప్పడంతో పరీక్షించిన సర్జన్
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అరెస్ట్ అయిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడుకి ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చడంతో ఇతర వైద్య సేవల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని ఉపయోగిస్తున్నారు. దీంతో అరెస్ట్ చేసిన అచ్చెన్నను కోర్టులో హాజరు పరచడానికి ముందు ఈఎస్ఐకి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆర్ఎంఓ డాక్టర్ శోభ పర్యవేక్షణలో బీపీ, మధుమేహ పరీక్షలు చేశారు. అనంతరం కరోనా పరీక్షల కోసం అచ్చెన్న నుంచి స్వాబ్ నమూనాలు సేకరించారు. కాగా, తనకు కాలు నొప్పిగా ఉందని అచ్చెన్నాయుడు చెప్పడంతో సర్జన్ ఆయన కాలును  పరీక్షించారు.
Atchannaidu
ESI Scam
TDP
Swab test

More Telugu News