Telangana: తెలంగాణలో కరోనాతో మరో 9 మంది బలి... కొత్తగా 164 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 9 మంది మరణించగా, ఇప్పటివరకు కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 174కి పెరిగింది. ఇక కొత్తగా 164 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వారిలో 133 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,484 కరోనా కేసులు నమోదు కాగా, 2,278 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,032 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.