Atchannaidu: కరోనా పరీక్షల కోసం అచ్చెన్నాయుడిని ఆసుపత్రికి తరలించిన అధికారులు

ACB officials arrives Vijayawada along with Atchannaidu
  • నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి విజయవాడ తరలింపు
  • ప్రాథమిక పరీక్షల అనంతరం ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లిన అధికారులు
  • కరోనా పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరు
నిమ్మాడలో అరెస్ట్ చేసిన టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విజయవాడ తీసుకువచ్చారు. అయితే, ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చాల్సి ఉండడంతో ముందుగా కరోనా పరీక్షల కోసం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. తొలుత విజయవాడ రాగానే ఆయనకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక కరోనా పరీక్షలు పూర్తయ్యాక అచ్చెన్నాయుడిని ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ న్యాయమూర్తి నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి 100 మీటర్ల పరిధిలో జనసంచారంపై ఆంక్షలు విధించారు.
Atchannaidu
Vijayawada
Corona Virus
ACB
ESI Scam

More Telugu News