Chandrababu: అచ్చెన్నాయుడు ఏమైనా టెర్రరిస్టా... ఇలా గోడలు దూకుతున్నారు!: వీడియో పంచుకున్న చంద్రబాబు

Chandrababu asks AP government whether Atchannaidu a terrorist
  • నిమ్మాడలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేసిన ఏసీబీ
  • అనుమతి లేకుండా గదుల్లోకి వెళ్లారంటూ చంద్రబాబు ఆగ్రహం
  • కుటుంబసభ్యులను కూడా బెదిరించారంటూ మండిపాటు
ఈఎస్ఐ కొనుగోళ్లలో రూ.150 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని నిమ్మాడలోని ఆయన స్వగృహంలో అరెస్ట్ చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడు ఓ ఎమ్మెల్యే అని, గతంలో మంత్రిగా చేశారని పేర్కొంటూ, ఆయనేమైనా టెర్రరిస్టా... ఆయన్ను అరెస్ట్ చేసేందుకు గోడలు దూకడం, కనీసం ఇంగితం లేకుండా ఇంట్లోని గదుల్లోకి దూసుకెళ్లడం ఏంటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడికి మందులు ఇవ్వాల్సి ఉందని కుటుంబసభ్యులు అభ్యర్థిస్తుంటే వారిని కూడా బెదిరించారని మండిపడ్డారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చే రోజు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

Chandrababu
Atchannaidu
Terrorist
Police
ACB
Andhra Pradesh

More Telugu News