నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పిన అచ్చెన్నాయుడి భార్య విజయ మాధురి!
- మా ఇంటిని చుట్టుముట్టారు
- తన భర్తకు సర్జరీ జరిగిందన్నా వినలేదు
- రాత్రంతా నిద్రపోనివ్వలేదన్న విజయ మాధురి
ఉదయం తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందని గుర్తు చేశారు. రాత్రంతా తన భర్తను నిద్రపోనివ్వలేదని, ఇల్లంతా సోదాలు చేశారని, కొన్ని వస్తువులను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. అర్ధరాత్రి తరువాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారని, ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే, ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.