బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పై కరోనా పంజా

7 Police of Banjara Hills PS tested corona positive
  • పీఎస్ లో పని చేస్తున్న ఏడుగురు పోలీసులకు పాజిటివ్
  • షాక్ కు గురైన పోలీస్ శాఖ
  • ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులంతా క్వారంటైన్ కు తరలింపు
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. తెలంగాణలో ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో మూడింట రెండు వంతుల కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా పోలీసులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో పలువురు మహమ్మారి బారిన పడుతున్నారు.

తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, పోలీస్ శాఖ షాక్ కు గురైంది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరించి... అందరినీ క్వారంటైన్ కు తరలించారు. వారందరి శాంపిళ్లను సేకరించి, కరోనా టెస్టులు చేస్తున్నారు.
Go Back to Shorts
Banjara Hills
Hyderabad
Police Station
Police
Corona Virus

More Telugu News