ఫామ్ హౌస్ విషయంలో.. కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట

TS High Court gives stay on NGT orders given to KTR
షార్ట్స్‌లో చూడండి
టీఎస్ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే జువ్వాడలో ఉన్న ఫామ్ హౌస్ వ్యవహారంలో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి  తెలిసిందే. జీవో 111కు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ ను నిర్మించారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. దీంతో, కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, పీసీబీ, హెచ్ఎండీఏలకు కూడా నోటీసులు ఇచ్చింది.

దీనికి తోడు ఒక నిజ నిర్ధారణ కమిటీని ఎన్జీటీ నియమించింది. రెండు నెలల్లోగా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈనేపథ్యంలో హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.
Go Back to Shorts
KTR
TRS
Farm House
TS High Court
NGT
Revanth Reddy
Congress

More Telugu News