Mamata Banerjee: కరోనా ఎక్స్ ప్రెస్ అని నేనెప్పుడు అన్నాను?: అమిత్ షాపై మమత ఫైర్

  • ఉద్యోగులకు షిఫ్టుల విధానాన్ని ప్రకటించాం
  • ఒక్కో షిఫ్టుకు 5 గంటల పని
  • రేపటి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది
I never called them as corona express says Mamata Banerjee

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాటల దాడి కొనసాగుతోంది. దేశ సమైక్యతను ప్రమాదంలోకి నెట్టేసిన వ్యక్తి అమిత్ షా అంటూ నిన్న మండిపడ్డ మమత... ఈ రోజు మరోసారి ఆయనపై నిప్పులు చెరిగారు. వలసవాదులను తరలిస్తున్న శ్రామిక్ రైళ్లను మమతా బెనర్జీ కరోనా ఎక్స్ ప్రెస్ రైళ్లు అనడం ద్వారా వాటిని ఆమె అవమానించారంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. వాటిని కరోనా ఎక్స్ ప్రెస్ లని తానెప్పుడు పిలిచానని ప్రశ్నించారు. తానెప్పుడూ అలా పిలవలేదని అన్నారు.

రాష్ట్రంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఉద్యోగులకు బెంగాల్ ప్రభుత్వం షిఫ్టుల విధానాన్ని ప్రకటించిందని మమత తెలిపారు. తొలి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు... రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఒక్కో షిఫ్టుకు 5 గంటల పని వేళలు ఉంటాయని అన్నారు. ఈ కొత్త విధానం రేపటి నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. మహమ్మారి కారణంగా ప్రజల వద్ద డబ్బులు లేవని... ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు పెంచవద్దని అన్నారు. వచ్చే నెల 30 వరకు పాఠశాలను తెరుచుకునే అవకాశం లేదని చెప్పారు.

More Telugu News