Allu Arjun: బన్నీ సినిమా కోసం అలా ప్లాన్ చేస్తున్నారు!

Huge sets errected for Puspa movie
  • లాక్ డౌన్ తో ఆగిపోయిన షూటింగ్ 
  • అటవీ నేపథ్యంలో సాగే కథ
  • ముందుగా ఇండోర్ షూటింగ్ యోచన
'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ వెంటనే తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభించాడు. 'పుష్ప' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు మొదలై కొన్ని రోజుల పాటు జరిగింది కూడా. అయితే, లాక్ డౌన్ విధించడంతో షూటింగుకి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే, 'పుష్ప' సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో రూపొందుతున్నందున షూటింగ్ ఎక్కువ భాగం అటవీ నేపథ్యంలో నిర్వహించాలి. ప్రస్తుతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలతో  కూడిన షూటింగులకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అవుట్ డోర్ లో చేయడం కుదరని పని. దాంతో ముందుగా ఇండోర్ సన్నివేశాల చిత్రీకరణను కానిచ్చేయడానికి, పాటలను చిత్రీకరించడానికి అనుగుణంగా హైదరాబాదులో భారీ సెట్స్ వేయడానికి చిత్రం యూనిట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. సో, ముందుగా కొన్నాళ్ల పాటు సెట్స్ లో షూటింగ్ చేస్తారన్న మాట. ఇక ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
Allu Arjun
Sukumar
Pushpa

More Telugu News