Rana: రానా, మిహీకాల పెళ్లి తేదీ అదే.. మార్పు లేదు!

Rana and Miheeka Bajaj marriage date is fixed
  • ఆగస్ట్ 8న రానా, మిహీకాల పెళ్లి
  • మూడు రోజుల పాటు జరగనున్న పెళ్లి వేడుకలు
  • తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం వేడుకలు
దగ్గుబాటి కుటుంబంలో పెళ్లిబాజాలు మోగనున్నాయి. రానా, మిహీకా బజాజ్ ల పెళ్లి తేదీ ఖరారైంది. ఆగస్ట్ 8వ తేదీన తన ప్రేయసి మిహీకా మెడలో రానా మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ విషయాన్ని రానా కుటుంబీకులు అధికారికంగా వెల్లడించారు. పెళ్లి తంతు మూడు రోజుల పాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. పెళ్లికి ముందు రెండు రోజుల పాటు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు ఇప్పటికే నిమగ్నమై ఉన్నాయి.

కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల మధ్య తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం వేడుకలను నిర్వహించనున్నారు. మిహీకా మార్వాడీ అమ్మాయి అనే విషయం తెలిసిందే. నిశ్చితార్థం లేకుండా నేరుగా పెళ్లిని నిర్వహించనున్నారు. మరోవైపు, కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెళ్లి వేడుకలను నిర్వహించనున్నారు.
Rana
Miheeka Bajaj
Marriage
Date
Tollywood
Bollywood

More Telugu News