Sidda Raghava Rao: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత శిద్దా రాఘవరావు

TDP leader Sidda Raghava Rao joins YSRCP
  • కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్న శిద్దా
  • జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంస
  • ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీలో మరో కీలకమైన వికెట్ పడిపోయింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. తన కుమారుడు సుధీర్ తో కలిసి వైసీపీలో చేరారు. వీరిద్దరినీ పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

వైసీపీలో చేరిన అనంతరం మీడియాతో శిద్దా మాట్లాడుతూ, జగన్ సమక్షంలో వైసీపీలో చేరానని చెప్పారు. ఏడాది కాలంగా జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని... భవిష్యత్తులో కూడా అమలు చేస్తారని అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు.
Sidda Raghava Rao
Telugudesam
Jagan
YSRCP

More Telugu News