Rajendranagar: రాజేంద్రనగర్‌లో మళ్లీ కలకలం రేపిన చిరుత.. కిటికీలోంచి ఇంట్లోకి తొంగిచూపు

  • భయపడుతున్న వర్సిటీ సిబ్బంది, స్థానికులు
  • వెంటనే బంధించాలని వేడుకోలు
  • నెల రోజులుగా ప్రయత్నిస్తున్నా చిక్కని చిరుత
Once again Leopard presence in Rajendra Nagar

హైదరాబాద్‌లో ఇటీవల కలకలం రేపిన చిరుత మళ్లీ కనిపించింది. రాజేంద్రనగర్‌‌లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో ఇది సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాదు, ఓ ఇంటి కిటికీలోంచి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిరుతను వెంటనే బంధించాలని యూనివర్సిటీ సిబ్బంది, స్థానికులు కోరుతున్నారు. కాగా, దాదాపు నెలరోజులుగా ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా అది మాత్రం చిక్కడం లేదు.

More Telugu News