ఢిల్లీలోని ఏపీ భవన్ కు తాకిన కరోనా సెగ... సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్

Senior official at Delhi AP Bhavan tested corona positive
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. నిత్యం పెద్ద సంఖ్యలో కేసులతో ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఓ సీనియర్ అధికారి కరోనా బారినపడ్డారు.

ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాలు మూసివేశారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్యాలయాలను శానిటైజ్ చేసి రెండ్రోజుల తర్వాత తెరవాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 27,654 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 761 మంది మరణించారు.
Go Back to Shorts
Senior Officer
AP Bhavan
Corona Virus
Positive
Sanitise
New Delhi

More Telugu News