తెలంగాణలో మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా... 24 గంటల్లో 10 మంది మృతి

Ten people dies of corona in Telangana state
  • తెలంగాణలో పెరుగుతున్న కరోనా మరణాలు
  • ఇప్పటివరకు 123 మంది మృత్యువాత
  • కొత్తగా 206 మందికి కరోనా పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 152 మందికి కరోనా
కరోనా మహమ్మారి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తెలంగాణలో మరింత పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 10 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 123కి పెరిగింది. ఇక కొత్తగా 206 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 152 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,496కి పెరిగింది. ఇప్పటివరకు 1,710 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,663 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Telangana
Deaths
Corona Virus
Positive
GHMC
Hyderabad
COVID-19

More Telugu News