ap7am logo

మరో దారుణం... గర్భిణిగా ఉన్న ఆవుకు పేలుడు పదార్థాలు పెట్టారు!

Sat, Jun 06, 2020, 05:49 PM
Pregnant cows jaw blown off due to explosive
  • ఉత్తరప్రదేశ్ బిలాస్ పూర్ జిల్లాలో దారుణం
  • బాంబు కారణంగా పేలిన ఆవు దవడ
  • పక్కింటి వ్యక్తే దీనికి కారణమని ఫిర్యాదు చేసిన ఆవు యజమాని
కొబ్బరికాయలో పేలుడు పదార్థాలను అమర్చి ఓ గర్భిణి ఏనుగును కేరళలో చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటి మరో దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బిలాస్ పూర్ జిల్లా జాందుత్తలో ఓ గర్భిణి ఆవుకు పేలుడు పదార్థాలు పెట్టారు. దీనిపై ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతేకాదు ఆవుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన పొరుగింట్లో ఉంటున్న నందలాల్ అనే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించాడు. బాంబు పేలడం వల్ల ఆవు దవడ పగిలిపోయింది. ప్రస్తుతం తిండి కూడా తినలేని పరిస్థితిలో నరకాన్ని అనుభవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటన జరిగిన రోజు నుంచి నందలాల్ కనిపించడం లేదు. దీంతో, అతనిపై అనుమానాలు మరింత ఎక్కువవుతున్నాయి.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad