యూపీలో రక్తమోడిన రహదారి... ఇద్దరు చిన్నారుల సహా 9 మంది దుర్మరణం

Nine dies of accident in Uttarpradesh
  • స్కార్పియోలో రాజస్థాన్ నుంచి బీహార్ వెళుతున్న కుటుంబం
  • ట్రక్కును ఢీకొన్న స్కార్పియో వాహనం
  • ఘటన స్థలం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్
ఓ స్కార్పియో వాహనంలో రాజస్థాన్ నుంచి బీహార్ పయనమైన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. బీహార్ లోని భోజ్ పూర్ వెళుతుండగా, యూపీలోని ప్రతాప్ గఢ్ జిల్లా వజీద్ పూర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారుల సహా 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు.

ఈ ఘటన జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడ్నించి పారిపోయాడు. కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ యాక్సిడెంట్ సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.
Go Back to Shorts
Road Accident
Uttar Pradesh
Scarpio
Truck

More Telugu News