Corona Virus: దేశంలో ఒక్కరోజులో 9,851 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in india
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,851  మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 273 మంది మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,26,770 కి చేరగా, మృతుల సంఖ్య 6348 కి చేరుకుంది. 1,10,960 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News