Warangal Rural District: గొర్రెకుంట సామూహిక హత్యల కేసు నిందితుడిపై అత్యాచారం కేసు!

Police filed another two cases on Gorrekunta killer Sanjay kumar
  • తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైన గొర్రెకుంట హత్యలు
  • పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలను వెల్లడించిన నిందితుడు
  • 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్‌పై పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు. నిందితుడిని గత నెల 30న పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సంజయ్ కుమార్ విస్తుపోయే విషయాలను వెల్లడించాడు.

రఫీకా కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భం దాల్చినట్టు తేలింది. బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేసిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, సంజయ్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Warangal Rural District
Gorrekunta
Murders
Sanjay kumar

More Telugu News