తెలంగాణలో కరోనా విజృంభణ... ఆరుగురి బలి
Add ap7am to your home Screen

తెలంగాణలో కరోనా విజృంభణ... ఆరుగురి బలి

Six more died due to corona in Telangana
  • రాష్ట్రంలో 105కి పెరిగిన కరోనా మరణాలు
  • కొత్తగా మరో 127 కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలోనే 110 మందికి పాజిటివ్
కరోనా మహమ్మారి తెలంగాణలో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనాతో  ఆరుగురు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 105కి పెరిగింది. ఇక, కొత్తగా మరో 127 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇవన్నీ లోకల్ కేసులే. జీహెచ్ఎంసీలో 110 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడి కాగా, ఆదిలాబాద్ 7, రంగారెడ్డి 6, మేడ్చెల్ 2, సంగారెడ్డి 1, ఖమ్మం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,147 కాగా, ఇప్పటివరకు 1,587 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1,455 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Telangana
Corona Virus
Deaths
Positive
GHMC
Hyderabad
COVID-19

More Telugu News