తిరుమల సత్రాల వద్ద తిరుగుతున్న చిరుత.. భయాందోళనలతో సిబ్బంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల సత్రాల వద్ద తిరుగుతున్న చిరుత.. భయాందోళనలతో సిబ్బంది

Leopard wandering in Tirumala karnataka satra
  • కర్ణాటక సత్రం వద్ద రెండు రోజులుగా సంచరిస్తున్న చిరుత
  • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు
  • నిఘా పెంచిన అధికారులు
తిరుమలలో నిన్న తెల్లవారుజామున కర్ణాటక సత్రం, రింగురోడ్డు సమీపంలో చిరుత సంచరించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చిరుత రెండు రోజలుగా ఇక్కడే తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

విషయం తెలిసిన మఠాల్లోని సిబ్బంది భయంతో వణుకుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడం వల్ల పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్డుపైకి వచ్చి యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. తాజాగా, సత్రాల వద్ద చిరుత తిరుగుతున్న సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెంచారు.
Tirumala
Leopard
Lockdown

More Telugu News