Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. మార్చ్ తర్వాత 10 వేల మార్క్ దాటిన నిఫ్టీ

  • 284 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 82 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • ఐదున్నర శాతం పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా
Sensex closes higher for sixth strait day

దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్, ఫార్మా రంగాల అండతో సూచీలు లాభాల్లో దూసుకుపోయాయి. అయితే చివర్లో కొంతమేర అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో లాభాలు తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు లాభపడి 34,110కి పెరిగింది. నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకుని 10,062 వద్ద స్థిరపడింది. మార్చ్ తర్వాత నిఫ్టీ 10వేల పాయింట్లను దాటడం ఇదే తొలిసారి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.51%), కోటక్ మహీంద్రా (3.31%), బజాజ్ ఫైనాన్స్ (2.83%), నెస్లే ఇండియా (2.81%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.70%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.96%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.62%), భారతి ఎయిర్ టెల్ (-1.13%), మారుతి సుజుకి (-1.12%), ఇన్ఫోసిస్ (-0.95%).

More Telugu News