Chandrababu: ట్రస్ట్ భూముల మీద వైసీపీ పెద్దలు కన్నేశారు.. తండ్రి ఆశయాలను బతికించుకోవడానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారు: చంద్రబాబు

YSRCP trying to grab MANSAS lands says Chandrababu
  • రూ. 1.30 లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ కన్నేసింది
  • భూములను కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
  • ఏ ప్రభుత్వం కూడా మాన్సాస్ విషయాల్లో జోక్యం చేసుకోలేదు
మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన రూ. 1.30 లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. భూములు కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ట్విట్టర్ ద్వారా ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, 'మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు.

అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువ చేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ గజపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి' అని చెప్పారు. అశోక్ గజపతిరాజు మాట్లాడుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు.
Chandrababu
Ashok Gajapathi Raju
Telugudesam
YSRCP

More Telugu News