Nisarga: అరేబియా సముద్రంలో నిసర్గ... మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లో హైఅలర్ట్

High alert in Maharashtra and Gujarat as Nisarga braces towards west coast
  • అరేబియా సముద్రంలో తీవ్ర వాయుగుండం
  • మరో 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం
  • ముంబయిపై పంజా విసరనున్న నిసర్గ!
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. మరో 6 గంటల్లో ఇది తుపానుగా మారుతుందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపానుగా ఏర్పడితే దీన్ని నిసర్గ అనే పేరుతో వ్యవహరిస్తారు. ఇది రేపు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ వద్ద తీరం చేరుతుందని అంచనా వేస్తున్నారు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తుపాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 105 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ముఖ్యంగా, ముంబయి మహానగరంపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు.
Nisarga
High Alert
Maharashtra
Gujarat
Goa
Arabia Sea

More Telugu News