Srishailam: శ్రీశైలం దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

Police busts Srishailam scam
  • శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ.2.12 కోట్ల స్కాం
  • 27 మంది అరెస్ట్
  • డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా మోసాలు
శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్టు గుర్తించారు. షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఈ కుంభకోణంలో మొత్తం రూ.2.12 కోట్లు స్వాహా జరిగినట్టు తేల్చారు. పోలీసులు ఇప్పటివరకు రూ.83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
Srishailam
Scam
Police
Double Printing
Fake ID

More Telugu News