Nitya Menon: కరణం మల్లేశ్వరి పాత్రను తిరస్కరించిన ప్రముఖ నటి?

  • వెండితెరకు కరణం మల్లేశ్వరి కథ 
  • సంజనా రెడ్డి దర్శకత్వంలో బయోపిక్
  • ఆఫర్ ను తిరస్కరించిన నిత్యా మీనన్
  • మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు
Nitya Menon rejects biopick offer

కరణం మల్లేశ్వరి!
మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారతీయ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేసిన క్రీడాకారిణి. ఒలింపిక్స్ లో భారత్ కు పతకాన్ని సంపాదించిపెట్టిన ఈ తెలుగుతేజం కథ వెండితెరకు ఎక్కనున్న సంగతి విదితమే. నిన్న ఆమె జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఎంవీవీ సత్యనారాయణతో కలసి ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.

ఇక పాన్ ఇండియా చిత్రంగా దీనిని నిర్మించాలని నిర్మాతలు భావిస్తున్నందున ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించడానికి సత్తా వున్న నటి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రముఖ నటి నిత్యా మీనన్ ను నటించాల్సిందిగా దర్శక నిర్మాతలు అడిగినట్టు తెలుస్తోంది. అయితే, ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఆమె ఈ ఆఫర్ ని ఎందుకు తిరస్కరించిందన్న దానిపై కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News