LG Polymers: ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో మరొకరి మృతి.. 14కు పెరిగిన మృతుల సంఖ్య!

LG polymers death toll raised to 14
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్టణంలో గత నెలలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 14కు పెరిగింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స అనంతరం కోలుకున్న వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచిలి కనకరాజు (45) నిన్న మరణించాడు. కార్పెంటర్ అయిన కనకరాజుకు భార్య, కుమారుడు ఉన్నారు.

గత  నెల ఏడో తేదీన గ్యాస్ లీక్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన కనకరాజు రెండు రోజుల చికిత్స అనంతరం కోలుకున్నాడు. అయితే, గత రెండు రోజులుగా ఆయాసం, కడుపు ఉబ్బరంతో శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో నిన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. అతడి మరణానికి స్టైరీన్ విష వాయువే కారణమని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్థులు, నాయకులు డిమాండ్ చేశారు. కాగా, కనకరాజు మృతితో ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 14కు పెరిగింది.
Go Back to Shorts
LG Polymers
Visakhapatnam District
dead

More Telugu News