సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Anushka to be cast opposite Gopichand
  • గోపీచంద్ సరసన అనుష్క 
  • 'వకీల్ సాబ్' షూటింగ్ అప్ డేట్
  • బాలకృష్ణ బర్త్ డేకి టైటిల్ ప్రకటన
  • ఫైట్ తో మొదలెట్టనున్న మనోజ్
*  గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ 'అలిమేలు మంగ వేంకటరమణ' పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కథానాయికలుగా కాజల్, అనుష్కలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, అనుష్క ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయని అంటున్నారు.
*  పవన్ కల్యాణ్ చాలా కాలం తర్వాత మళ్లీ నటిస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. శ్రీరాం వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ షూటింగులకు అనుమతించడంతో తిరిగి ఈ నెలలో మొదలవుతుంది. పవన్ వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగులో పాల్గొంటారు. ఆయన ఇరవై రోజుల షూటింగ్ చేయాల్సి వుంది.
*  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ ఈ నెల 10న వెలువడుతుందని భావిస్తున్నారు. ఆ రోజున బాలకృష్ణ జన్మదినం కావడంతో టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించారట.    
*  మంచు మనోజ్ నటిస్తున్న 'అహం బ్రహ్మాస్మి' చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ముందుగా పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Go Back to Shorts
Anushka Shetty
Teja
Pawan Kalyan
Balakrishna
Manchu Manoj

More Telugu News