వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా
- కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు
- వైద్యుల కోసం 50 వేల సీట్లు కేటాయించిన ఎయిర్ ఏషియా
- కనీస చార్జీ మినహాయింపు
ఈ సీట్లకు కనీస చార్జీని మినహాయించారు. సదరు ప్రయాణికుడు కేవలం ఎయిర్ పోర్టు ఫీజు, ఇతర పన్నులు చెల్లిస్తే చాలు. దేశంలో ఎక్కడికైనా నామమాత్రపు చార్జీతో ప్రయాణించవచ్చు. జూలై 1 నుంచి సెప్టెంబరు 30 మధ్య ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వైద్యులు తమ వివరాలను జూన్ 12 లోపు నమోదు చేసుకోవాలి. సంప్రదింపుల వివరాలు, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, ఐడీ వంటి వివరాలు అందిస్తే ఎయిర్ ఏషియా వర్గాలు వాటిని పరిశీలించి టికెట్ మంజూరు చేస్తాయి.