కాబోయే భర్తతో చనువుగా ఉండబోయిన యువతి... వద్దన్నందుకు ఆత్మహత్య!

Lady Sucide in Hyderabad
కాబోయే భర్తే అయినా పెళ్లికి ముందు చనువుగా ఉండవద్దని తండ్రి హెచ్చరించాడన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లాకు చెందిన కుంచల శివారెడ్డి తన కుటుంబంతో కలిసి మౌలాలి సమీపంలోని జవహర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతను, తన కుమార్తె కవిత (20)కు ఇటీవల మేనబావ కృష్ణారెడ్డితో వివాహాన్ని నిశ్చయించి, ఎంగేజ్ మెంట్ ను జరిపించాడు.

ఈ క్రమంలో రెండు వారాల క్రితం కృష్ణా రెడ్డి, శివారెడ్డి ఇంటికి రాగా, కవిత అతనితో చనువుగా ఉంది. దాన్ని గమనించిన శివారెడ్డి, కుమార్తెను వారించి, పెళ్లి ముందు సన్నిహితంగా ఉండవద్దని హెచ్చరించాడు. దీంతో కవిత మనస్తాపానికి గురైంది. శుక్రవారం నాడు పురుగుల మందు తాగగా, విషయాన్ని గమనించిన కుటుంబీకులు, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు యశోదా ఆసుపత్రికి తరలించినా కూడా, ఫలితం లభించలేదు. కవిత మృతి చెందగా, విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Pestiside
Sucide
Bride
Hyderabad
Police

More Telugu News