మహేశ్ బాబా? లేక గౌతమ్ కు అన్నయ్యా?... వైరల్ పిక్!

28-05-2020 Thu 08:40
  • కుమార్తెతో మిర్రర్ సెల్ఫీ
  • ఫిజిక్ తో పాటు అందాన్ని పెంచుకున్న మహేశ్
  • అద్భుతంగా ఉందంటున్న నెటిజన్లు
Mahesh Mirror Selfy Pic goes Viral

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు తాజా ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండి, ఫిట్ నెస్ ను మరింతగా పెంచుకున్న మహేశ్, ఫిజిక్ తో పాటు తన అందాన్ని కూడా పెంచుకుని మరింత యంగ్ గా కనిపిస్తున్నారు.

తన లేటెస్ట్ పిక్ ను ఆయన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, గౌతమ్ కు అన్నయ్య ఉన్నాడా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పిక్ లో కుమార్తె సితారతో మిర్రర్ సెల్ఫీని మహేశ్ తీసుకుంటున్నారు. కళ్లు తిప్పుకోలేనంత అందంగా మహేశ్ బాబు కనిపిస్తుండగా, తన యంగ్ ఏజ్ లో కూడా ఆయన ఇంతలా ఆకట్టుకునే రూపంతో ఉండి ఉండరని, అంత బాగున్నారని కామెంట్లు వస్తున్నాయి.