America: నా ట్వీట్లకే నిజ నిర్ధారణా?.. ట్విట్టర్‌పై ట్రంప్ ఫైర్

Donald Trump fires on Twitter
  • ట్రంప్ ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్ చిహ్నం తగిలించిన ట్విట్టర్
  • అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందని మండిపాటు
  • ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సంస్థలతో నిజనిర్ధారణ చేసుకోమంటారా? అంటూ అగ్రహం
తాను చేసిన ట్వీట్లకు ఫ్యాక్ట్ చెక్ అవసరమన్న ట్విట్టర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌లను ప్రసారం చేసే వారి పోస్టుల ఆధారంగా తన పోస్టులను నిర్ధారించుకోమనడం దారుణమని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే అవకాశం ఉందంటూ ట్రంప్ మంగళవారం ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌ దిగువన ట్విట్టర్ నీలిరంగు ఆశ్చర్యార్థక చిహ్నాన్ని తగిలించింది. అంటే దీనర్థం ఫ్యాక్ట్ చెక్ చేసుకోమని!

అయితే, తన ట్వీట్‌కు ఫ్యాక్ట్ చెక్ చిహ్నాన్ని తగిలించడం ట్రంప్‌కు కోపం తెప్పించింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిల్ ఇన్ బ్యాలెట్లపై తన ప్రకటన సరికాదని ట్విట్టర్ చెబుతోందని అయితే, ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సీఎన్ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్టుల ఆధారంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోమంటున్నారంటూ ట్రంప్ ధ్వజమెత్తారు.
America
Donald Trump
Twitter

More Telugu News