మోదీజీ, ఆ పావురం నాదే.. ఇప్పించరూ ప్లీజ్: పాక్ యువకుడి వేడుకోలు

27-05-2020 Wed 22:06
  • పావురంపై గులాబీ రంగు మచ్చ, కాలికి తొడుగు
  • గూఢచారి పావురమని అనుమానం
  • అది తనదేనంటూ మీడియా ముందుకొచ్చిన హబీబుల్లా
Pakistani villager urges India to return spy pigeon

పాకిస్థాన్ నుంచి ఇటీవల ఎగురుకుంటూ వచ్చిన ఓ పావురం కశ్మీర్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పావురంపై గులాబీ రంగు మచ్చ ఉండడం, దాని కాలికి రింగు తొడిగి ఉండడంతో అది గూఢచర్యం నెరపడానికే వచ్చిందని అనుమానించారు. అయితే, ఇప్పుడా పావురం విషయంలో ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఆ పావురానికి, పాక్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని, అది గూఢచారి పావురం కాదంటూ సరిహద్దులోని పాక్ గ్రామానికి చెందిన హబీబుల్లా అనే వ్యక్తి మీడియా ముందు మొరపెట్టుకున్నాడు. ఆ పావురం తనదేనని, పావురం రింగుపై ఉన్న నంబరు తన ఫోన్ నంబరని అతడు చెబుతున్నాడు. దయచేసి ఆ పావురాన్ని తనకు అప్పగించాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశాడు. కాగా, పావురంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.