రంగనాయకమ్మ గారు పెట్టిన పోస్టునే నేనూ పెడుతున్నా... నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి: నారా లోకేశ్

23-05-2020 Sat 14:57
  • ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై రంగనాయకమ్మ పోస్టు
  • రంగనాయకమ్మపై సీఐడీ విచారణ షురూ
  • సోషల్ మీడియా అనగానే జగన్ లో వణుకు అంటూ లోకేశ్ ట్వీట్
Nara Lokesh challenges government over Ranganayakamma issue

వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన వ్యవహారంపై గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది. దాంతో ఆమెపై సీఐడీ విచారణ చేపట్టారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.

రంగనాయకమ్మ గారు పెట్టిన పోస్టునే నేను కూడా పెడుతున్నాను, నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. సోషల్ మీడియా అనగానే వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలవుతుందని, అసమర్ధ పాలన సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తుంది అనే భయం ఆయనను వెంటాడుతోందని విమర్శించారు.