Police: లాక్ డౌన్ కాలంలో స్వాధీనం చేసుకున్న వాహనాలు యజమానులకు ఇచ్చేస్తాం: ఏపీ పోలీస్

AP Police says confiscated vehicles during lock down will be handed over to owners
  • ఏపీలో కొనసాగుతున్న లాక్ డౌన్
  • నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు జప్తు
  • సంబంధిత పత్రాలతో వస్తే తిరిగిచ్చేస్తామని పోలీస్ విభాగం వెల్లడి
లాక్ డౌన్ నియమావళిని ఉల్లంఘించిన అనేకమందిపై ఏపీ పోలీసులు చర్యలు తీసుకోవడమే కాదు, వారి నుంచి వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నట్టు రాష్ట్ర పోలీసు విభాగం వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు ఇచ్చేస్తున్నామని, సంబంధిత పత్రాలతో ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి వాహనాలను తిరిగి పొందవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.
Police
Andhra Pradesh
Vehicles
Confiscation
Lockdown

More Telugu News